Badlapur incident : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్ చిన్నారులపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. బద్లాపూర్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని చెప్పారు. ఘటన జరిగిన పాఠశాలపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.
కేసును ఫాస్ట్‌ట్రాక్ ప్రక్రియలో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం వెల్లడించారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాగా, మహారాష్ట్రలోని థానే స్కూల్లో మూడేండ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆగస్ట్ 12-13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్‌రూంకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
థానే జిల్లా బద్లాపూర్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించింది. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.పోక్సో కేసులో సైతం స్ధానిక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శుభద షిటోలె ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారని బాధిత తల్లితండ్రులు, స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.
Read More :
Sperm Donation | అదుపు తప్పిన వీర్యదానం.. విదేశాలకు సైతం ఎగుమతి!