Road Accident | చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం
Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. సంఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. రాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై ఓ మలుపు వద్ద ఎస్యూవీ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌తో పాటు మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు లారిమా నుంచి పొరుగునే ఉన్న సూరజ్‌పూర్ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వాహనం వేగంగా వెళ్లడంతోనే నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని క్రేన్ సహాయం బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళ, మరో చిన్నారి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
बलरामपुर
बीती रात बड़ा सड़क हादसा
हाई स्पीड स्कॉर्पियो सड़क किनारे खदान में गिरी
8 लोगों की मौत, मृतकों में 1 महिला 1 बच्ची भी शामिल।
राजपुर-कुसमी रोड में बूढ़ा बगीचा के पास की घटना
स्कॉर्पियो में सवार सभी लोग सूरजपुर हा रहे थे #Balrampur #Accident #Chhattisgarh pic.twitter.com/HQlACaedE6
— Anshuman Sharma (@anshuman_sunona) November 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

