ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వచ్చిన అధికారులు.. విచారణ కోసం తీసుకెళ్లడంతో మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈడీపై శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
నవాబ్ మాలిక్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ తీసుకెళ్లిన తీరు మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారిందన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నవాబ్ మాలిక్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు వ్యతిరేకంగా ఇలాంటి వాతావరణమే ఉందన్నారు. నవాబ్ మాలిక్‌పై చర్యలను ఎంపీ సుప్రియా సూలే ఖండించారు.