న్యూఢిల్లీ: ఎన్నికల్లో పాత్రికేయ విధులను నిర్వహించేవారికి రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు రాష్ర్టాల్లోని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరింది. ఎన్నికల ప్రచారాన్ని రిపోర్ట్ చేసే పాత్రికేయులు వేధింపులకు, దాడులకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.