న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు కాదని వాదించింది. గురువారం సుప్రీంకోర్టుకు ఈ మేరకు అఫిడవిట్ సమర్పించింది.
‘ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవడానికి కూడా ఇప్పటివరకూ ఎప్పుడూ మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారం అనేది కనీసం న్యాయ పరమైన హక్కు కూడా కాదు’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుపై సుప్రీం ధర్మాసనం శుక్రవారం(నేడు) తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.