రాంచి, మే 12: జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మే 14న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నది. ఓ ఫ్లాట్లో రూ.32 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కేసులో గత వారం ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్(52)ను, పనిమనిషి జహంగిర్ ఆలం(42)ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొందరు వ్యక్తులకు కమీషన్లు ఇచ్చేందుకు ఈ డబ్బులను సంజీవ్ కుమార్ లాల్ వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, సంజీవ్ కుమార్ లాల్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆలంగిర్ పేర్కొన్నారు.