చెన్నై, నవంబర్ 15: చెన్నైకు చెందిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి ఈడీ అధికారులు శుక్రవారం రూ.8.8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆయన గృహం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ప్రారంభించిన సోదాలు రెండో రోజూ కొనసాగాయి.
మార్టిన్, అతని సహచరులకు చెందిన సుమారు 20 ప్రాంగణాలపై ఏకకాలంలో చెన్నై, కోయంబత్తూరు, ఫరీదాబాద్, లూధియానా, కోల్కతాలో ఈ దాడి జరిగింది. ఆయన కార్పొరేట్ కార్యాలయం నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు మార్టిన్ దేశంలోనే అత్యధికంగా 1,300 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.