చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఇవాళ ఉదయం మంత్రి పొన్ముడి, అతని కుమారుడు గౌతమ్ నివాసాలపై రైడ్స్ చేశారు.
ఇద్దరి నివాసాల్లో కలిపి రూ.70 లక్షల నగదు పట్టుబడిందని, ఆ నగదు ఎలా వచ్చిందో తండ్రీ, కొడుకులు వివరించలేకపోయారని, అందుకే దాన్ని సీజ్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఈ రూ.70 లక్షలతోపాటు మరో రూ.10 లక్షల ఫారిన్ కరెన్సీని కూడా పొన్ముడి నివాసం నుంచి సీజ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, తన మంత్రులపై ఈడీ దాడులు కేంద్ర సర్కారు కుట్ర అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు.