న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు సాగుతున్నది.
ఈ కుంభకోణంలో ఈడీ ఇప్పటివరకు రూ.400 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.