బెంగళూరు: వాల్మీకి కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ తుకారాంతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలలో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బళ్లారిలోని ఐదు నివాస ప్రాంగణాలు, బెంగళూరు నగరంలోని మూడు ప్రాంగణాలలో సోదాలు నిర్వహించినట్లు వారు చెప్పారు. తుకారాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారా భరత్ రెడ్డి(బళ్లారి నగరం), జేఎన్ గణేశ్ (కంప్లీ), ఎన్టీ శ్రీనివాస్(కుడ్లిగి) నివాసాలలో సోదాలు జరిగినట్లు వారు తెలిపారు.