న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఢిల్లీలోని ఓ ఇంటిపై ఈడీ అధికారులు దాడులను చేపట్టగా బంగారం, వజ్రాలు, కోట్ల రూపాయల నగదు కట్టలతో నిండిన సూట్‌కేసులు లభ్యమయ్యాయి. రూ.14 కోట్ల విలువజేసే సొత్తును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఢిల్లీకి చెందిన రావ్ ఇందర్జిత్ యాదవ్ సహచరుడు అమన్కుమార్కు సంబంధించి ఒక ప్రాంగణం నుంచి ఈ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.
రూ.5 కోట్లకుపైగా నగదు, రూ.8.8 కోట్లు విలువజేసే బంగారం, వజ్రాలతో నిండిన మరో సూట్‌కేసు, రూ.35 కోట్ల ఆస్తులకు సంబంధించిన చెక్‌బుక్‌లు, డాక్యుమెంట్స్‌తో నిండిన బ్యాగ్ లభ్యమయ్యాయని ఈడీ తెలిపింది. హత్య, మోసం, దోపిడీ సహా వివిధ నేరాలకు సంబంధించి రావ్ ఇందర్జిత్పై 15కుపైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రావ్ ఇందర్జిత్ కోసం ప్రస్తుతం ఈడీ, హర్యానా పోలీసులు గాలిస్తున్నారు.