బెంగుళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాన్యా రావు(Ranya Rao)తో లింకున్న బెంగుళూరులోని పలు ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్నది. 17 బంగారు కడ్డీలతో వస్తున్న రాన్యా రావును బెంగుళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ నటిపై మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు బుక్ చేశారు. సీబీఐ, డీఆర్ఐ కేసుల ఆధారంగా .. రాన్యా రావును అరెస్టు చేశారు.
రాన్యా రావుపై సీఐడీ విచారణను ఉపసంహరించడానికి తనపై ఎటువంటి వత్తిడి లేదని కర్నాటక హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. రాన్యాపై సీఐడీ కేసును ఎత్తివేస్తున్నట్లు చెప్పిన 24 గంటల్లోనే కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రాన్యా తండ్రి, డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ కే రామచంద్రా రావు పాత్రను వెలికి తీసేందుకు అదనపు సీఎస్ గౌరవ్ గుప్తాను నియమించాలని డీపీఏఆర్కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.