బెళగావి: కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి, బెళగావి జిల్లా ఇన్చార్జి మంత్రి సతీశ్ జార్ఖిహోళి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. బెళగావిలోని కువెంపు నగర్లో, గోకాక్ పట్టణంలో, బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
ఈ దాడుల్లో ఈడీ వెంట కేంద్ర పారామిలిటరీ బలగాల వెంట ఉన్నాయి. జార్ఖిహోళి బావమరిది, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ వై మంజునాథ్ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. జార్ఖిహోళి కుమార్తె ప్రియాంక చిక్కోడి ఎంపీగా ఉన్నారు.