నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 10 కోట్లు డిమాండ్ చేసి, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడినట్టు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.