రాంచీ, జూన్ 22: భూఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు రాంచీలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. కోటి నగదు, 100 బులెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
కమలేశ్ సింగ్ అనే వ్యక్తికి చెందిన నివాసంలో శుక్రవారం సాయంత్రం సోదాలు చేశామని తెలిపారు. జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్పై నమోదైన భూఅక్రమణల ఆరోపణల కేసులో భాగంగా ఈ సోదాలు చేసినట్టు, ఇది వేరే ప్లాట్‌కు సంబంధించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటి వరకు సొరేన్ సహా 25 మందినిపైగా ఈడీ అరెస్టు చేసింది.