ఈడీ సోదాలు పత్రికాస్వేచ్ఛపై దాడే.. న్యూస్‌క్లిక్‌పై పీఎంఎల్ఏ కేసు కొట్టివేత
స్వతంత్ర డిజిటల్ వార్తా సంస్థ న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఈడీ తీసుకొన్న చర్యలను ఢిల్లీ హైకోర్ట్ గత నెల 29న కొట్టివేసింది.
న్యూఢిల్లీ: స్వతంత్ర డిజిటల్ వార్తా సంస్థ న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఈడీ తీసుకొన్న చర్యలను ఢిల్లీ హైకోర్ట్ గత నెల 29న కొట్టివేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక పాత్రికేయాన్ని లక్ష్యంగా చేసుకొని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కేసును ఈడీ అల్లిందని చెప్తూ ఆ సంస్థపై మనీ లాండరింగ్ కేసును కొట్టివేసింది. ఈడీ అనుసరించిన చర్యను కోర్టు ’అన్వేషణాత్మక గాలింపు చర్య’గా అభివర్ణించింది. ‘ఏ విధమైన నేరం లేనప్పటికీ పిటిషనర్ల ఆర్థిక వ్యవహారాల్లో దర్యాప్తు జరిగిన తీరు.. వాటి గురించి గాలించడానికి అటూ ఇటు తిరగడం లాంటిదేనని స్పష్టంగా తెలుస్తున్నది’ అని కోర్టు తెలిపింది.
ఏడాదిన్నరపాటు దర్యాప్తు చేసినా నేరం జరిగిందని గుర్తించడం లేదా రికార్డ్ చేయడం జరగలేదని కోర్ట్ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ను కూడా కోర్ట్ కొట్టివేస్తూ.. దాన్ని కొనసాగనివ్వడం చట్టపరమైన పక్రియను తీవ్రంగా దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నది. ఉనికిలో లేని ఒక యూఎస్ సంస్థ నుంచి న్యూస్‌క్లిక్‌కు 2018లో నిధులు వచ్చాయని ఈడీ ఆరోపించి కేసు నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

