కోల్‌కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ (Teachers Jobs Scam) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్‌కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. సీఏలు, వ్యాపారవేత్తలు సహా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
వ్యాపారవేత్తలు సుబోధ్ సచర్, అశోక్ యదుకకు చెందిన రెండు ఫ్లాట్లు సహా బుర్రాబజార్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. ప్రైమరీ స్కూల్ జాబ్ స్కామ్‌కు సంబంధించి తమ విచారణలో భాగంగా సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు తెలిపారు.
బుర్రాబజార్, కకుర్గచ్చి, ఈఎం బైపాస్ తదితర ప్రాంతాల్లో పలువురు వ్యక్తుల ఇండ్లు, కార్యాలయాలపై సోదాలు జరిగాయని చెప్పారు. డబ్బును దారిమళ్లించడంలో వీరికి ప్రమేయం ఉందని, దీనికి సంబంధించిన పత్రాలు, ఇతర బ్యాంక్ డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Read More :
Vijayakanth | కెప్టెన్ ‘ప్రేమ’ వివాహం..