Vijayakanth | కెప్టెన్ ‘ప్రేమ’ వివాహం..
నల్లకళ్లజోడుతో ఎప్పుడూ సీరియస్గా కనిపించే విజయకాంత్ (Vijayakanth) వ్యక్తిగత జీవితంలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది..
Vijayakanth | నల్లకళ్లజోడుతో ఎప్పుడూ సీరియస్గా కనిపించే విజయకాంత్ (Vijayakanth) వ్యక్తిగత జీవితంలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఆయనది ప్రేమ వివాహం. 1990, జనవరి 31న ప్రేమలతను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. 1979లో ఇనిక్కుం ఇలామై చిత్రంలో తెరంగేట్రం చేసిన ఆయన.. వరుస సినిమాలతో తమిళంలో టాప్ హీరోగా ఎదిగారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా 20కిపైగా సినిమాల్లో నటించిన ఆయన తనకంటూ ఓ మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో 1990లో ప్రేమలతను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న తన 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
విజయకాంత్, ప్రేమలత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. కెప్టెన్ సినీ వారసత్వాన్ని రెండో కుమారుడైన షణ్ముగ కొనసాగిస్తున్నారు. 2014లో ఆయన సగప్తాహం సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

