ED | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఈడీ తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని అత్యవసర విచారణ కోరే అవకాశం ఉంది.
ED moves Delhi High Court against the order of the trial court granting bail to Delhi CM Arvind Kejriwal in Delhi Excise policy money laundering case.
ED is likely to mention the matter for an urgent hearing. pic.twitter.com/zoPVr5a6cO
— ANI (@ANI) June 21, 2024
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ ( liquor policy case)కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీకి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు షరతులు విధించారు. దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో కోర్టుకు హాజరుకావాలని, అదేవిధంగా దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. దీంతో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం బెయిల్‌పై బయటకు రానున్నారు.
Also Read..
Arvind Kejriwal | నేడు తీహార్ జైలు నుంచి విడుదల కానున్న అరవింద్ కేజ్రీవాల్
Vijay Sethupathi | విలన్ పాత్రలు ఎలా ఉండాలో చెప్పిన విజయ్ సేతుపతి
AP Assembly | కొలువుదీరిన ఏపీ అసెంబ్లీ.. ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ ప్రమాణస్వీకారం