ED | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన మనీలాడరింగ్ కేసులో గూగుల్, మెటా కంపెనీల అధికారులు సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ల్ఫూయెన్సర్లు అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న వారిపై దృష్టి పెట్టింది.
వాస్తవానికి ఈ యాప్‌ల్లో చాలా వరకు ‘స్కిల్ బేస్డ్ గేమ్స్’గా చెప్పుకుంటూ అక్రమ బెట్టింగ్‌లకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈడీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇప్పటికే 29 మందిపై కేసు నమోదు చేసింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)లో ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖల పేర్లు సైతం ఉన్నాయి. ఇదే కేసులో నలుగురు టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారణకు పిలిచింది.
ఇదిలా ఉండగా.. అక్రమ బెట్టింగ్ వ్యవహారం, గ్యాబ్లింగ్ ప్లాట్‌ఫారాలను సోషల్ మీడియా, యాప్స్‌లో గూగుల్, మెటా వంటి సంస్థలు ఇలాంటి యాప్‌లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థ ఆరోపించింది. టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలకు స్లాట్లు కేటాయించడంతో పాటు వెబ్సైట్ల లింక్స్‌ను సైతం అందుబాటులో ఉండేలా చూస్తున్నాయని ఈడీ పేర్కొంటున్నది. ఇప్పటికే దేశంలో మహదేవ బెట్టింగ్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారణకు పిలిచింది.
ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ సహా పలువురు ప్రముఖులపై అభియోగాలున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ఈ యాప్ ప్రమోషన్లతో పలువురు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నంలో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణ జరుపుతున్నది.