ED Raids | బెంగళూరులోని మూడు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం దాడులు నిర్వహించింది. ఎడ్టెక్ కంపెనీ బైజూ సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల (ఫెమా) విషయంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది. దాడుల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (ఫెమా) నిబంధనల మేరకు ఇల్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు.
వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. రవీంద్రన్ బైజుకు సమన్లు పంపినా.. ఈడీ ఎదుట హాజరుకావడం లేదని ఈడీ ఆరోపించింది. లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ 20211 నుంచి 23 మధ్య కాలంలో రూ.28వేలకోట్ల ఫారిన్ డైరెక్టరేట్ ఇన్వెస్ట్మెంట్స్ (FDI) పొందినట్లు పేర్కొంది. ఈ కాలంలో కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో వివిధ విదేశీ అధికారులకు దాదాపు రూ.9,754 కోట్లను పంపినట్లు ఏజెన్సీ ఆరోపించింది.