Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్‌కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఆర్ధిక వ్యవస్ధ సానుకూల సంకేతాలతో మెరుగైన వృద్ధి రేటును సాధించనున్నట్టు తెలిపింది. 2024-25లో 6.5-7 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. 2023 ఆర్ధిక సంవత్సరంలో వెల్లడైన ఆర్ధిక ఉత్తేజం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్ధిక వ్యవస్ధ స్ధిరత్వాన్ని కొనసాగిస్తూ వాటి ప్రభావాలను దేశ ఆర్ధిక వ్యవస్ధపై పడకుండా నిరోధిస్తుందని పేర్కొంది. నిలకడైన వినిమయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఊతంగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తుందని తెలిపింది. కాగా, అంతకుముందు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను నేడు పార్లమెంట్‌కు సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిర్మలమ్మ సభలో ప్రసంగించారు.
Read More :