ganesh chaturthi | వినాయక చవితికి విభిన్న రూపాల్లో గణేశుడి ప్రతిమలను ప్రతిష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. మిగిలిన వినాయకుల కంటే కూడా తమ గణనాథుడు ఆకర్షణీయంగా కనిపించాలని విభిన్న రీతుల్లో అలంకరిస్తుంటారు. అందుకే డాక్టర్, రైతు, జవాన్, పోలీస్.. ఇలా విభిన్న రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను భక్తులు మండపాల్లో ప్రతిష్టించి పూజిస్తుంటారు. మరికొందరైతే పండ్లు, పూలు, ఇతర ఆహార పదార్థాలతోనూ వినాయకుడిని తయారు చేస్తుంటారు. ఇలాంటి విభిన్న గణపతులను చూసేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఈసారి తమ వినాయకుడు ఆకర్షణీయంగ కనిపించాలని కొంతమంది భక్తులు డార్క్ చాక్లెట్‌తో గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. పంజాబ్‌లోని లూథియానాలో ఏర్పాటు చేసిన ఈ డార్క్ చాక్లెట్ గణపతికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
గత ఆరేళ్లుగా చాక్లెట్‌తోనే వినాయకుడి ప్రతిమను తయారు చేసి పూజిస్తున్నామని లూథియానాలోని ఒక బేకరీ యజమాని హర్జీందర్ సింగ్ కుక్రేజా తెలిపాడు. ఈ విధంగా పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు. ఈ చాక్లెట్ వినాయకుడిని 200 కిలోల డార్క్ చాక్లెట్‌తో తయారు చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం 10 మంది చెఫ్‌లు 10 రోజుల పాటు శ్రమించారని చెప్పారు. ఈ విగ్రహాన్ని పాలల్లో నిమజ్జనం చేస్తామని.. ఆ తర్వాత పిల్లలకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష పరిహారం ఎలా చేసుకోవాలి?
వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?
Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..