వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?
Vinayaka Chavithi | గణపతికి తులసి దళం సమర్పించకూడదని చెబుతారు ఎందుకు? వినాయక చవితి రోజు మాత్రం తులసి సమర్పించడం వెనుక కారణం ఏమైనా ఉన్నదా?
నాక్షతైః అర్చయేద్విష్ణుం
న తులస్యా గణాధిపం!
అనేది శాస్త్ర ప్రమాణం. అక్షతలతో విష్ణు మూర్తికి, తులసీ దళాలతో గణపతికి పూజచేయగూడదని ఈ నియమం చెపుతుంది. తులసీ దళాలను గణపతికి వాడక పోవడానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అంశ వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూచి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని అడుగుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో ‘దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మ’ని గణపతిని శపిస్తుంది తులసి. ‘రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని’ ప్రతిశాపం ఇస్తాడు వినాయకుడు. అయితే, ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా.. ‘విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావ’ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసున్ని వివాహమాడుతుంది. కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతణ్నెవరూ జయించ లేకపోతారు. వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. తర్వాత శ్రీహరి వరంతో తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని ‘శిరస్సు లేకుండుగాక’ అని తులసి శపిస్తుంది. తనను శపించిందన్న కోపంతో తెలసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే, వినాయకచవితి రోజు మినహా మరేరోజూ వినాయకుడికి తులసి సమర్పించరు.
డా॥ శాస్త్రుల రఘుపతి,73867 58370
Read More :
“గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? “
Ganesh Chaturthi 2022 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
పూరీ జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఇదే..
ఏకదంతుడిని ఎన్ని పత్రాలతో పూజించాలి? వినాయకుడి పూజకు వాడే ఆకులతో ఎలాంటి లాభాలున్నాయి?
Ganesh Chaturthi 2022 | వినాయకుడి వాహనం అయిన మూషికం గురించి ఈ విషయాలు తెలుసా !
ఈ 8 వినాయక మందిరాలను దర్శిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోవాల్సిందే
నవరాత్రుల్లో గణేశుణ్ని ఏ రోజు ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలి?
Ganesh Chaturthi | వినాయకుడి ఈ రూపాలకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసా!!
Ganesh Chaturthi 2022 : గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామగ్రి ఏంటంటే..
Vinayaka Chavithi | గణేశుడికి తులసిదళం ఎందుకు సమర్పించరు?
Vinayaka Chavithi | అరుదైన రూపాల్లో వినాయకుడు కనిపించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?
“Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

