న్యూఢిల్లీ: బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ(Bihar SIR)పై చర్చ చేపట్టాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అంశంపై పార్లమెంట్లో చర్చించడం అంటే, అన్ని నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన అన్నారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష ఎంపీలు సహకరిచాలని ఆయన కోరారు. సభా కార్యక్రమాను అడ్డుకోరాదన్నారు. మనం చర్చించడం కోసం చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని, జాతీయ క్రీడా విధాన్ని తామేమీ ప్రవేశపెట్టడంలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది వ్యక్తిగత వ్యవస్థ అని, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉందని, ఆ అంశాలను పార్లమెంట్లో డిస్కస్ చేయలేమని మంత్రి రిజిజు తెలిపారు.
విపక్ష సభ్యుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రతి ఒక్కరు ఒకే రకమైన రూల్స్ పాటించాలన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినందుకు సరైన రీతిలో వ్యవహరించడం లేదని ఖర్గే అన్నారు. సభలో గందరగోళం సృష్టిస్తున్నవారికి సభలో మాట్లాడే హక్కులేదని జేపీ నడ్డా తెలిపారు. అయినా కానీ బీహార్ సిర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
VIDEO | Parliament Monsoon Session: Union Parliamentary Affairs Minister Kiren Rijiju (@KirenRijiju) says, “The government has been very open to hold debate and discussion on any and every topic. However, every discussion in the Parliament has to be accorded with the rules… On… pic.twitter.com/I1oeiOeNtT
— Press Trust of India (@PTI_News) August 6, 2025