Election Commission of India | ఎన్నికల ప్రలోభాల్లో అవే టాప్.. ఈసీ ఎంత జప్తు చేసిందంటే..?!
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ.8,889 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా గుజరాత్ లోనే పట్టుకున్నామని వివరించింది.
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.8,889 కోట్ల విలువైన డబ్బు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలు స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొత్తులో మాదక ద్రవ్యాలు 45 శాతం ఉంటాయని, వాటి విలువ రూ.3,958 కోట్లు అని పేర్కొంది.
తమ తనిఖీల్లో రూ.849.15 కోట్ల క్యాష్, రూ.814.85 కోట్ల విలువైన మద్యం, రూ.1,260.33 కోట్ల విలువ గల ఆభరణాలు, రూ.2,006.59 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నాయని ఈసీ వివరించింది. గుజరాత్ ఏటీఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ చేపట్టిన ఆపరేషన్లలో మూడు రోజుల్లోనే రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపింది.

అత్యధికంగా గుజరాత్లో రూ.1,461.73 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఈసీ పేర్కొంది. తర్వాతీ స్థానాల్లో రూ.1133.82 కోట్లతో రాజస్థాన్, రూ.734.54 కోట్లతో పంజాబ్ నిలిచాయి. ఇక తెలంగాణలో రూ.333.55 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

