న్యూఢిల్లీ: ఎన్నికల విషయంలో తాము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలను ఎన్నికల సంఘం ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ అన్నారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఓట్ల చోరీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి బదులు వాటిపై దర్యాప్తునకు ఈసీ ఆదేశించి ఉండాల్సిందన్నారు.
బీహార్లో ఈసీ ‘సర్’ను నిర్వహించిన విధానాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ ఓటర్లు, ప్రతిపక్షాల విశ్వాసాన్ని గెలుచుకొనేలా ఉండాలని అన్నారు. ఈసీపై వస్తున్న విమర్శలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని ఆయన తెలిపారు.