న్యూఢిల్లీ: ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. 100 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంటే.. తిరిగి పాత విధానమైన బ్యాలెట్ పేపర్లోకి మారడమేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అన్ని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయగా జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణ చేపట్టారు.