న్యూఢిల్లీ : ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అంతకు ముందు బీజేపీ ఉన్నత స్థాయి బృందం ఖర్గే వ్యాఖ్యలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను కలిసి ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది.
ఆయనపై బీఎన్ఎస్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, ఆయనను హెచ్చరించాలని కోరింది. ఆయన వ్యాఖ్యలను అన్ని సామాజిక మాధ్యమాల వేదికల నుంచి తొలగించాలని కోరింది.