ముంబై: ఎలక్షన్ కమిషన్‌కి పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఉన్నదని, పార్టీల పేర్లను మార్చే అధికారం లేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అమరావతిలో సోమవారం ఆయన మాట్లాడుతూ తన తాత కేశవ్ ఠాక్రే పార్టీకి శివసేన అని పేరు పెట్టారని, ఈసీ దాన్ని ఎలా మారుస్తుందన్నారు. పార్టీ పేరు దొంగతనానికి ఎవరికీ అనుమతి ఇవ్వబోనన్నారు.