Heart Attack | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేవారితో పోలిస్తే, లేటుగా భోంచేసేవారికి వచ్చే కష్ట నష్టాలపై ఫ్రాన్స్‌లో లక్ష మందిపై అధ్యయనం చేశారు.
ఏడు సంవత్సరాలు వారి ఆహారపు అలవాట్లును, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసిన వారికి గుండెపోటు సమస్యలు, మినీ స్ట్రోక్ (తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్)లు వచ్చినట్లు గుర్తించారు.