Earthquake | మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.33 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మధ్నాహ్నం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరిగిందని సమాచారం లేదని తెలిపారు. అయితే, సింగ్రౌలీలో భూకంపం సంభవించడం గత వారంలో ఇది రెండోసారి. ఇంతకు ముందు డిసెంబర్ 26న తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి.
రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతతో భూమి కంపించింది. వారంలో రెండోసారి భూకంపం రావడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ మూడు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. వేకువ జామున 1.36గంటలకు కల్పాలో 3.4, సిమ్లాలో 1.53గంటలకు 2.4, ఉదయం 3.05 గంటలకు కిన్నౌర్‌లో 2.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మీజోరాంలోని కోలాసిబ్‌లో ఉదయం 4.17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరించింది. భూ ప్రకంపనలు తక్కువ స్థాయిలో ఉండడంతో ఎలాంటి నష్టాలు జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.