అమృత్సర్: పంజాబ్లో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 92 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.