న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలోని మిజోరంలో భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం తెల్తవారుజామున 1.43 గంటలకు చంఫైలో (Champhai) భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.2గా నమోదయింది. చంఫైకి 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
ఈనెల 11న కూడా మిజోరంలో భూకంపం సంభవించింది. గత శనివారం ఐజ్వాల్‌లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదయింది. ఐజ్వాల్ లో భూమి కంపించింది. ఐజ్వాల్‌కు 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. గతనెల 29న కూడా రాష్ట్రంలో భూకంపం వచ్చింది. చంఫై సమీపంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.