ఇంపాల్ : మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. ఉదయం 6.గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని ఎన్సీఎస్ పేర్కొంది. అలాగే గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.25 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13గంటలకు మరోసారి రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురయ్యారు.