న్యూఢిల్లీ, మే 28 : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ-20 పెట్రోల్.. వాహనదారుల్లో గుబులు పుట్టిస్తున్నది. మొక్కజొన్న-చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ఈ ఇథనాల్ పెట్రోల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ-20 పెట్రోల్‌తో 2022 అంతకంటే ముందు వాహనాలు కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు తమ వాహనం మైలేజీ తగ్గిపోయిందని, రిపేర్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2023 ముందు వాహనాల్లో అధికారులు చెబుతున్న దాని ప్రకారం 1 నుంచి 6 శాతం మైలేజీ పడిపోవాలి. కానీ ఓనర్లు మాత్రం గతం కంటే 20శాతం మైలేజీ పడిపోతున్నదని చెప్తున్నారు.