AI Digital Highway | దేశంలోనే ఏఐ డిజిటల్ హైవే అందుబాటులోకి..! దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?
AI Digital Highway | భారత జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది.
AI Digital Highway | భారత జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది. వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణను ప్రధాన లక్ష్యంగా దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-గురుగ్రామ్‌లను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ స్మార్ట్ వ్యవస్థను ప్రారంభించడంతో.. ఈ రహదారి దేశంలో తొలి AI ఆధారిత డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. ఈ అత్యాధునిక వ్యవస్థ 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదు. సీటు బెల్ట్ లేకపోవడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, అధిక వేగంతో ప్రయాణించడాన్ని తక్షణమే గుర్తిస్తుంది. స్మార్ట్ కెమెరాలు వాహనాల వివరాలను తక్షణమే ఎన్ఐసీ ఈ-చలాన్ పోర్టల్, సంబంధిత పోలీసులకు పంపిస్తుంది.
దాంతో మానవ జోక్యం లేకుండానే ఆటోమేటిక్‌గా చలాన్స్ జారీ అవుతాయి. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్-48పై మొత్తం 56.46 కిలోమీటర్ల పొడవునా ఈ సిస్టమ్ అమలులో ఉంది. ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున 110 హై-రిజల్యూషన్ PTZ కెమెరాలు అమర్చారు. ఇవి 24 గంటలూ రహదారి పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. ఈ వ్యవస్థకు కేంద్ర కంట్రోల్ రూమ్ ఒక డిజిటల్ బ్రెయిన్ లా పనిచేస్తుంది. ప్రమాదాలు, పొగమంచు, అడ్డంకులు, జంతువుల ప్రవేశం తదితర అంశాలను ఇది వెంటనే గుర్తించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

