న్యూఢిల్లీ: ఢిల్లీ, దాని పొరుగున ఉన్న ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో శుక్రవారం దాదాపు 152 విమానాలు రద్దయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఏమీ కనిపించని స్థితి ఏర్పడిందని, రద్దు చేసిన 152 విమాన సర్వీసులలో 79 నిష్క్రమణ, 13 ఆగమన విమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కాలుష్య తీవ్రత ఆధారంగా మూడు పరిస్థితులలో పనిచేస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలో జాప్యాలు, అవాంతరాలు ఏర్పడుతున్నట్లు వారు చెప్పారు. తమ విమానాల స్టేటస్ గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్‌ని అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయాణికులకు ఎక్స్ పోస్టులో ఢిల్లీ ఎయిర్‌పోర్టు సూచించింది.