Hit And Drag | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ (Christmas Eve) ముందురోజు రాత్రి మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ (Car Driver) బైక్‌ను ఢీ కొట్టి సుమారు అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లాడు (Hit And Drag). ఈ ఘటనలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 24న రాత్రి 7:15 గంటల సమయంలో సుమనహళ్లి ఫ్లైఓవర్ నుంచి నాగరభావి సర్కిల్‌కు వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. 38 ఏండ్ల శ్రీనివాస్ కేవీ తన కారులో అతివేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో కారు నడుపుతున్నాడు. అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న రోహిత్ అనే వ్యక్తిని కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. అనంతరం బైక్‌ను కారు దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో రోహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఇతర వాహనదారులు కారును ఆపి రోహిత్‌ను రక్షించారు. అనంతరం కారు డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైకర్‌కు ఛాతీ, కాళ్లు, చేతులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read..
UP Man Kills Wife | రహస్యంగా మొబైల్ వాడుతోందని.. భార్యను హత్య చేసి.. దృశ్యం సినిమాను తలపించే సీన్
Railway Ticket Fares | ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి