కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. రవీంద్రభారతి విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కోల్‌కతా శివారులోని బీటీ రోడ్ వద్ద నిరసన చేపట్టారు. అయితే పోలీసులకు అనుబంధంగా ఉన్న సివిల్ వాలంటీర్ మద్యం మత్తులో ఒక నిరసనకారుడ్ని బైక్‌తో ఢీకొట్టాడు. (Drunk Civic Volunteer Rams Bike) దీంతో మిగతా నిరసనకారులు అతడ్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీస్ తారకేశ్వర్ ఆ వాలంటీర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ కూడా నిరసనకారులతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి బీటీ రోడ్డును దిగ్భంధించారు. ఉదయం 9.30 గంటల వరకు నిరసనలు కొనసాగించారు. పౌర వాలంటీర్‌తోపాటు అతడ్ని తప్పించేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్‌పై కూడా ఫిర్యాదు చేశారు.
మరోవైపు సివిల్ వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడ్ని సస్పెండ్ చేశారు. అలాగే వాలంటీర్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్‌పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో విద్యార్థులు తమ నిరసనను విరమించారు.
A civic volunteer, who was riding a bike in drunken state, caught red-handed by the protestors. Watch this report
(@Suryavachan )#News #KolkataHorror #ITVideo @ahuja_harshit94 pic.twitter.com/LTCcNjzpoC— IndiaToday (@IndiaToday) August 31, 2024