Jagannath Rath Yatra : అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగే జగన్నాధ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరి జగన్నాధ్‌ను దర్శించారు. రాష్ట్రపతికి ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు.
#WATCH | Visuals from Puri where the chariots of Lord Jagannath and his siblings – Balabhadra and Goddess Subhadra are to be ceremoniously pulled by devotees, as the two-day Lord Jagannath Rath Yatra to commence today.
(Source – President of India) pic.twitter.com/VeCvE7YfGe
— ANI (@ANI) July 7, 2024
ఇక జగన్నాధ రథయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాధుడి దర్శించుకుని రథయాత్రలో పాలుపంచుకున్నారు. కాగా, ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం ప్రారంభమైంది. 1971 నుంచి జరుగుతున్న ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.
ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
Read More :