Mobile Phones Stolen | ఓ మ్యూజిక్ ఫెస్ట్ (music festival )లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి (Mobile Phones Stolen). హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదివారం గురుగ్రామ్‌లోని బ్యాక్‌యార్డ్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్ట్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారు. సుమారు 10వేల మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫెస్ట్ మధ్యలో ఆకస్మికంగా కరెంట్ పోయింది (power cut). ఆ సమయంలో రెండు డజన్లకు పైగా మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. కరెంట్ వచ్చిన తర్వాత చాలా మంది తమ ఫోన్లు పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు సెక్టార్ 65 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏడుగురు బాధితులు తమ ఫోన్లు చోరీకి గురైనట్లు ఆదివారం అర్ధరాత్రి తర్వాత కంప్లెయింట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 12 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దొంగలించిన మొబైల్స్‌లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు.
Also Read..
Nanded hospital | 8 రోజుల్లో 108 మరణాలు.. నాందేడ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న మరణమృదంగం
Israel-Hamas war | ఇజ్రాయెల్‌లో 40 మంది పసిబిడ్డలను హత్యచేసిన హమాస్
Congress | కాంగ్రెస్ టికెట్ రూ.25 కోట్లు..? ఒక్కరికి టికెట్ ఇస్తే.. మిగతావారి దారెటు..?