జెరూసలేం: ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణహోమానికి పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. దేశంలో మొత్తం 40 మంది పసిబిడ్డలను హమాస్ ఉగ్రవాదులు హతమార్చారని తెలిపింది. హమాస్ దాడులకు పాల్పడిన ప్రాంతాల్లో 40 మంది పసిపిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైనికులు తెలిపినట్లు ఆ న్యూస్ ఛానెల్ పేర్కొంది. ఆ 40 మంది పసివాళ్ల మృతదేహాల్లో కొన్నింటికి తలలు వేరు చేయబడి హృదయవిధారకంగా ఉన్నాయని తెలిపింది.
అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని చాలా కుటుంబాల్లో వ్యక్తులు మంచాలపై తూటా గాయాలతో మరణించి ఉన్నారని ఆ దేశ వార్తా ఛానెల్ వెల్లడించింది. ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా 5000 రాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. దాంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల కలిపి ఇప్పటి వరకు 3 వేల మందికి పైగా మరణించారు.