Vehicles Collide | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తోపాటు యూపీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది (Dense fog). దీంతో విజిబిలిటీ పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో పొగమంచు కారణంగా నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే (Greater Noida expressway)పై పలు వాహనాలు ఢీ కొన్నాయి (Vehicles Collide). ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రసైన్‌పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగ మంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడంతో డజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మహిళ సహా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం దెబ్బతిన్న వాహనాలను క్రేన్ల సాయంతో తొలగించి.. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Also Read..
Air Pollution | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. పడిపోయిన దృశ్యమానత.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ
Lionel Messi | మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్
IndiGo | ఇండిగో కీలక ప్రకటన.. బాధిత ప్రయాణికులకు రూ.500 కోట్ల పరిహారం