Dowry Case | వరకట్న వేధింపుల కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పింది. భర్త తరఫు వారిని ఇరికించే ధోరణులు కనిపిస్తున్న నేపథ్యంలో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా.. అమాయక కుటుంబ సభ్యులు అనవసర ఇబ్బందులు పడకుండా జాగ్రత్తపడాలని చెప్పింది. ఫ్యామిలీ వివాదాల కారణంగా తలెత్తే క్రిమన్ కేసుల్లో నిర్దిష్ట ఆరోపణలు లేకుండా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించడాన్ని ప్రారంభంలోనే అడ్డుకోవాలని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గృహ సంబంధిత వివాదాలు తలెత్తిన సమయంలో భర్త కుటుంబ సభ్యులందరినీ ఇరికించే ప్రయత్నం తరచుగా జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమేనని.. న్యాయపరంగా ఇది రుజువైందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా అమాయకులు ఎవరూ చిక్కుకోండా కోర్టులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. భర్తతో పాటు ఆయన అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై భార్య దాఖలు చేసిన ఓ వరకట్న వేధింపుల కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. అయితే, ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.