Double Murder | దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు ఇద్దరు బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫార్స్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. మృతులు ఆకాశ్ (40), రిషబ్ (16) మృతి చెందగా.. క్రిష్ శర్మ (10) గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షహదారా ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో బిహారీ కాలనీలో కాల్పులు జరిగినట్లు పీసీఆర్ కాల్ వచ్చిందన్నారు.
సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఆకాశ్, అతడి మేనల్లుడు రిషబ్, కొడుకు కుమారుడు క్రిష్‌కు గాయాలయ్యాయన్నారు. తీవ్ర గాయాలతో ఆకాశ్, రిషబ్ చనిపోయారని చెప్పారు. ప్రాథమిక విచారణలో ఐదురౌండ్లు క్పాలు జరిగినట్లుగా తేలింది. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ కాల్పులు జరిపే ముందు పాదాలను తాకాడు. ఆ తర్వాత కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆకాశ్ శర్మ పక్కనే ఉన్న రిషబ్, క్రిష్‌కు సైతం తూట గాయాలయ్యాయి. వారిని ఆసుప్రతికి తరలించగా.. ఆకాశ్ శర్మ, రిషబ్ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. క్రిష్ శర్మ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదు.