లక్నో: డ్యూటీలో ఉన్న డాక్టర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. (Doctor scrolls through reels) గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పటికీ ఆ వైద్యుడు పట్టించుకోలేదు. దీంతో ఆమె గుండెపోటులో మరణించింది. నిలదీసిన మహిళ కుమారుడి చెంపపై ఆ డాక్టర్ కొట్టాడు. ఆగ్రహించిన మహిళ బంధువులు ఆ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల ప్రవేశ్ కుమారి మంగళవారం తీవ్ర ఛాతినొప్పితో బాధపడింది. కుమారుడు గురుశరణ్ సింగ్‌కు ఈ విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో మహారాజా తేజ్ సింగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మహిళను తీసుకువచ్చారు.
కాగా, ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సెంగర్ తన మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ చూడటంలో బిజీగా ఉన్నాడు. ఆ మహిళ పరిస్థితి గురించి ఆమె కుమారుడు, బంధువులు డాక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అతడు పట్టించుకోలేదు. ఆమెను చూడాలని నర్సులకు చెప్పాడు. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమయ్యాడు.
మరోవైపు ఆ డాక్టర్ ఎదుటే విలవిలాడిన ఆ మహిళ గుండెపోటుతో మరణించింది. దీంతో మహిళ కుమారుడు నిలదీయగా అతడి చెంపపై ఆ డాక్టర్ కొట్టాడు. ఈ నేపథ్యంలో మహిళ బంధువులు ఆగ్రహించి ఆ డాక్టర్‌పై దాడి చేశారు.
ఈ విషయం తెలిసి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
At the #Mainpuri district hospital in #UttarPradesh, a 60-year-old woman, #PraveshKumari, died of a heart attack while the doctor on duty, #DrAdarshSanger, allegedly watched reels on his mobile phone.
The woman’s family claims that crucial time was lost due to the doctor’s… pic.twitter.com/ZGLcD5ZExg
— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2025