New Year 2026 | కొత్త సంవత్సరానికి (New Year 2026) ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. మరికొద్ది గంటల్లో న్యూఇయర్ వస్తుండటంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా? హ్యాపీ న్యూఇయర్ అని ఎప్పుడెప్పుడు చెప్పుకుంటామా? అని ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని దేశాల్లో కొత్త ఏడాది ఒకేసారి రాదు. ఒక్కో దేశం ఒక్కో సమయంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇక భారత్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటగానే కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. అయితే, మనం కొత్త ఏడాదికి స్వాగతం పలికేలోపే కొన్ని దేశాల ప్రజలు న్యూఇయర్‌లోకి అడుగుపెట్టేస్తారు.
పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి (Kiribati Leads) ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే వాళ్లకు న్యూఇయర్ మొదలైపోతుంది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్ (New Zealand) కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. అక్కడ సాయంత్రం 6:30 గంటలకు న్యూఇయర్ మొదలవుతుంది. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో రాత్రి 8:30 గంటలకు, చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో రాత్రి 9:30 గంటలకు, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియాలో రాత్రి 10:30 గంటలకు న్యూఇయర్ మొదలవుతుంది.
భారత్ తర్వాత 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అయితే, చివరిగా మాత్రం అమెరికానే న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతుంది.
Also Read..
New year 2026 | న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయో తెలుసా..?
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్
Dense Fog | ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు