హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపడం సరికాదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆ యన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లేవారు రూ.10వేలు అదనంగా చెల్లించాలని కేంద్ర హజ్ కమిటీ ఉత్తర్వులు జారీ చే యడం ఏంటని ప్రశ్నించారు. గతంలో లక్ష ఉన్న హజ్ యాత్ర రుసుము రూ.3,60,000 వేలకు పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.