చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో లోక్‌సభ సీట్లు ఖరారు చేసింది. (DMK finalises Lok Sabha seats) మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. తమిళనాడులో తొమ్మిది లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒక సెగ్మెంట్‌ను కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. వీసీకే, సీపీఎం, సీపీఐకు రెండేసీ సీట్లు చొప్పున ఇచ్చింది. వైకో నేతృత్వంలోని మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే)కు తిరుచిరాపల్లి నియోజకవర్గాన్ని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు రామనాథపురం స్థానాన్ని డీఎంకే కేటాయించింది.
కాగా, చెన్నై నార్త్, చెన్నై సౌత్, చెన్నై సెంట్రల్, శ్రీపెరంబుదూర్, అరక్కోణం, కాంచీపురం (SC), తిరువణ్ణామలై, వెల్లూరు, ధర్మపురి, కళ్లకురిచి, సేలం, పొల్లాచ్చి, నీలగిరి (SC), కోయంబత్తూరు, తేని, అరణి, పెరంబలూరు, ఈరోడ్, తంజావూరు, తెన్కాసి (SC), తూత్తుకుడి లోక్‌సభ స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది.
మరోవైపు తిరువళ్లూరు (SC), కృష్ణగిరి, కరూర్, కడలూరు, మయిలాడుతురై, శివగంగ, విరుదునగర్, కన్యాకుమారి, తిరునెల్వేలి, పుదుచ్చేరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్నది. విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీకి చిదంబరం(SC), విల్లుపురం (SC) స్థానాలు, సీపీఎంకు మధురై, దిండిగల్ సీట్లు, సీసీఐకు తిరుపూర్, నాగపట్నం (SC) స్థానాలు కేటాయించారు.
ఇక తిరుచిరాపల్లి సీటు నుంచి ఎండీఎంకే, నమక్కల్ స్థానాన్ని ఉదయించే సూర్యుని చిహ్నంపై కొంగునాడు మక్కల్ దేశీయ కచ్ (కేఎండీకే), రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పోటీ చేయనున్నాయి. నటుడు కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.